Donald Trump: 2024లో అధ్యక ఎన్నికల్లో పోటీ చేస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. అయోవాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. అయోవాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. మరోసారి వైట్ హౌస్ బిడ్ చేస్తానని చెప్పాడు. మరోసారి పోటీ చేసి అధ్యక్ష పదవీని దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2024లో పదవీని దక్కించుకోవడం ఖాయమంటూ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం అయోవాలోని సియోక్స్ సిటీలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తిరిగి అధికారంలోకి రాబోతోతున్నాము.. వైట్ హౌస్‌ను తిరిగి దక్కించుకుంటామని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఆయన రిపబ్లికన్ల కోసం ప్రచారం చేయనున్నారు.
2020లో భారీ మెజార్టీతో గెలుపొందామని అన్నారు. ఎన్నికల్లో అవకతవకల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చేందుకు అవకాశాన్ని వినియోగించుకున్నారు ట్రంప్. నేను రెండుసార్లు పోటీ చేసాను. రెండుసార్లు గెలిచాను. రెండో సారి గెలిచిన తర్వాత మొదటి సారి కంటే ఎంతో అభివృద్ధి చేశాను. 2016లో వచ్చిన దానికంటే 2020లో మిలియన్ల కొద్దీ ఓట్లు సాధించాను. అలాగే మన దేశ చరిత్రలో ఎక్కువ ఓట్లు పొందాను అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మన దేశాన్ని గ్లోరియస్‌గా మార్చడానికి మళ్లీ అధికారంలోకి వస్తాను. ట్రంప్ 72 మిలియన్ల ఓట్లను పొందారు. కానీ ఇప్పుడున్న అధ్యక్షుడు జో బైడెన్ 81 మిలియన్ల ఓట్లతో విజయం సాధించారు. 2024లో మళ్లీ ఆ పదవికి పోటీ చేస్తానని, బలమైన మెజార్టీ సాధిస్తానని అన్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య మళ్లీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.